KTR Challenge: బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 18వేల కోట్ల కాంట్రాక్టులు వదులుకో లేదంటే.. హైదరాబాద్ భాగ్యలక్ష్మి గుడికి రా.. మీ గుండు సంజయ్ మీద ఒట్టు వెయ్యి కాంట్రాక్టులు రాలేదని అంటూ ఛాలెంజ్ చేశారు. ఇక్కడ ఎవడేవేడో వచ్చి రాజకీయాలు చేస్తారు… కానీ తెలంగాణ వాళ్ళు దేశంలో రాజకీయాలు చేయడం తప్పా ? అంటూ ప్రశ్నించారు. ఫైనల్ ఎగ్జామ్ ముందు… మునుగోడు ఉప ఎన్నిక యూనిట్ టెస్టు అంటూ ఎద్దేవ చేశారు మంత్రి కేటీఆర్. బీజేపీ అప్పనంగా కాంట్రాక్టులు ఇవ్వకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఒప్పుకో అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. 18వేల కోట్ల కాంట్రాక్టులు వదులుకోవాలని లేదంటూ హైదరాబాద్ భాగ్యలక్ష్మి గుడికి వచ్చి మీ గుండు సంజయ్ మీద ఒట్టు వెయ్యి కాంట్రాక్టులు రాలేదని ఒప్పుకోమన్నారు. లేదంటే యాదాద్రికి వచ్చి మీ మోడీ మీద ఒట్టు వెయ్యి అంటూ సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్.
Read also: Home Minister Vanitha, Mp Madhavi Exclusive interview: వనిత టీవీతో రాజకీయాల్లో తిరుగులేని వనితలు
నేను తప్పుచేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు వుంటే మీడియా ముందు తీసుకురండని సవాల్ విసిరారు. నిన్న నల్లగొండ జిల్లా మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధారాలు వుంటే మీడియా ముందు తీసుకురండని సవాల్ విసిరారు.కేసీఆర్ కుటుంబానికి చీము, నెత్తురు, సిగ్గు, సరం వుంటే ఏమి ఎంక్విరీ చేస్తావో చెయ్ అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ దొంగలను పెంచిపోసిస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాదర్ కిషోర్ ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, లాండ్ మాఫియా చేస్తాడు అంటూ ఆరోపించారు. రుజువులుంటే ముందుకు రావాలని అన్నారు ఎటువంటి దానికైనా సిద్దమని అన్నారు. నన్ను కొనేశక్తి ఈప్రపంచంలో పుట్టలేదు పుట్టబోదని అమిషా మీటింగ్ లోనే సభా ముఖంగా తెలిపానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మా మునుగోడు ప్రజలు తలవంచుకునే పని ప్రాణంపోయినా నేను చేయను అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.
MLA Seethakka Doctorate: ఎమ్మెల్యే సీతక్కకు ఓయూ డాక్టరేట్..
