NTV Telugu Site icon

KTR: నీకు దమ్ముందా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

Ktr

Ktr

KTR: నీకు దమ్ముందా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. చంచల్ గూడ జైల్లో క్రిశాంక్ ను పరామర్శించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌ పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని మండిపడ్డారు. అసలు తప్పు చేసి రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి… బయట తిరుగుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ముందుకురా.. నువ్వు పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టి, ఏది ఒరిజినల్.. ఏది ఫోర్జ‌రి.. ఏది డూప్లికేట్ అనేది తేలుద్దాం అని కేటీఆర్ స‌వాల్ చేశారు. ఆ తర్వాత ఎవరు చంచల్ గూడలో ఎవరు ఉండాలో తేలిపోతుందన్నారు.

Read also: Komatireddy Venkat Reddy: మాది RR కాదు.. మీది AA.. మోడీకి కోమటిరెడ్డి సెటైర్‌

క్రిశాంక్ పోస్ట్ చేసిన సర్క్యూలర్ తప్పా..! చేయని తప్పుకు క్రిశాంక్‌ను జైల్లో వేశారన్నారు. క్రిశాంక్ ను ఉద్దేశ పూర్వకంగానే జైల్లో వేశారని మండిపడ్డారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకో అన్నారు. సర్కార్ చేసిన వెదవ పనికి వెంటనే క్షమాపణ చెప్పాలని.. క్రిశాంక్ ను విడుదల చేయాలని కోరారు. ఇక క్రిశాంక్ భార్య సుహాసిని మాట్లాడుతూ.. తన భర్తపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి కేసులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఓయూ మెస్‌ల మూసివేతకు సంబంధించిన సర్క్యులర్‌ను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై ఈ నెల 1న క్రిశాంక్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Komatireddy: కేసీఆర్ గురించి మాట్లాడటమే వేస్ట్.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..