NTV Telugu Site icon

KTR: జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దు.. కేటీఆర్ పిలుపు

Ktr

Ktr

KTR: ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందామన్నారు. కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను టిఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసిందన్నారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకులను వేల మందిని బీఆర్ఎస్ పార్టీ చూసిందన్నారు. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని మీలాంటోళ్లు చాలామంది నీలీగిన్రు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా రెండున్నర దశాబ్దాలు పార్టీ నిలబడి, నీలాంటి వాళ్ళను మట్టికరిపించిందన్నారు. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్… తెలంగాణ తెచ్చినందుకా… తెలంగాణను డెవలప్ చేసినందుకా… మిమ్మలను, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Vikarabad Post Office: వికారాబాద్ లో పోస్ట్ మాన్ నిర్వాకం.. చెత్తకుప్పలో ఆధార్, పాన్, ఏటీఎంలు

కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వతా కలిసిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడన్నారు. రేవంత్ రక్తం అంత బీజేపీదే… ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారిండన్నారు. గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నాడని అన్నారు. స్విట్జర్లాండ్ లో రేవంత్ రెడ్డి అదానితో అలైబలై చేసుకున్నాడని అన్నారు. అదాని రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు, లొగుట్టు బయటపెట్టాలన్నారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిండన్నారు. ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దన్నారు.