Site icon NTV Telugu

KTR Tweet: వరద సహాయక చర్యలు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటీఆర్ ప్రశంసలు

Ktr Tweet

Ktr Tweet

కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు, రాకపోకలు స్తంబించాయి. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేసారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయవద్దని సూచించారు. వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో.. సహాయచర్యలు చేపడుతున్న మంత్రులకు, ఎమ్మెల్యే లు పర్యటిస్తూ.. ప్రజలకు ధైర్యం చెబుతు ముందుకు సాగుతున్నారు. ముంపు పాంత్రాలను సందర్శిస్తూ.. ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అధికారులను వెంటబెట్టుకుని సమస్యలను పరిష్కరిస్తున్నారు.

read also: BJP : బీజేపీలో ఈటెల కొత్త సంప్రదాయానికి తెర లేపారా? |

అయితే ఈనేపథ్యంలో.. రాష్ట్ర రవానా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ లు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చిత్రాలను టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్‌ చేశారు. వారు చేస్తున్న సహాయక చర్యను కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ప్రశంసించారు. నగరంలో.. భద్రాచలంలో.. పలు జిల్లాల్లో.. భారీ వరదల దృష్ట్యా ప్రతీక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలతో మమేకమై స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న మంత్రులకు, ఎమ్మెల్యే లకు ప్రశంసల జల్లు కురింపించారు. నేడు (శుక్రవారం) ఉదయం ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ లు పర్యటిస్తున్న ఫోటోలను ట్విట్టర్‌ లో కేటీఆర్‌ పోస్ట్‌ చేసి అభినందించారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ముంపు ప్రాంతాల వాసులకు ధైర్యం చెబుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భారీ వర్షాలకు పలు ప్రాజెక్టులు పొంగి పొర్లుతుండటంతో..జనజీవనం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే..

Errol Musk: మస్క్ తండ్రి సంచలనం .. సవతి కూతురులో సంబంధం

Exit mobile version