KTR and Harish Rao About CPR: హరీష్ రావు వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైద్య రంగం ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్ కొనియాడారు. వరంగల్‌లో సుపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని.. కంటి వెలుగు, టీ డయాడ్నస్టిక్స్ అందుబాటులోకి తెచ్చామని అన్నారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలను గణనీయంగా పెంచామన్నారు. విదేశాల్లో మాస్టర్ చెకప్ చేయించుకుంటే, మన దగ్గర ఆ పరిస్థితి ఉందన్నారు. లైఫ్ స్టైల్‌లో చాలా మార్పులు వచ్చాయని.. ఈమధ్య సడన్ కార్డియక్ అరెస్ట్ సంఘటనలు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. ఇటీవల ఓ యువకుడు పెళ్లిలో నృత్యం చేస్తూ చనిపోతే, మరో వ్యక్తి జిమ్‌లో కసరత్తు చేస్తూ మృతి చెందాడని గుర్తు చేసుకున్నారు. తమ మామ కూడా ఇటీవల హార్ట్ ఎటాక్‌తో చనిపోయారని.. గుండెపోటు వచ్చిన సమయంలో ఏం చేయాలో తెలియక చనిపోతున్నారని పేర్కొన్నారు. హరీష్ రావుకు ఏం చెప్పినా వెంటనే రాసుకునే అలవాటు ఉందన్నారు. జన సంచారం ఉండే ప్రాంతాల్లో డీ ఫైభ్యులేటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో మాల్స్, ఇతర ప్రాంతాల్లో డి ఫైభ్యులేటర్ కచ్చితంగా పెట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ఒక లక్ష మందికి ట్రైనింగ్ ఇవ్వాలని.. ఐదుగురిని కాపాడినా, ఐదు కుటుంబాలను కాపాడిన వారు అవుతామని చెప్పుకొచ్చారు.
Revanth Reddy: ఇసుకని అక్రమంగా దోచుకుంటున్నారు.. బండి సంజయ్, ఈటెల ఏం చేస్తున్నారు?
అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీపీఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆలోచన కేటీఆర్‌దేనని పేర్కొన్నారు. కేటీఆర్ మామ గుండెపోటుతో చనిపోయిన రోజు ఎవరూ సీపీఆర్ చేయలేదని, దాంతో ఆయన చనిపోయారని అన్నారు. మన దేశంలో 15 లక్షల మందిలో రోజుకి నాలుగు వేల మంది సడన్ కార్డియక్ అరెస్టుకు గురవుతున్నారు. వారికి సీపీఆర్ చేస్తే.. 10 మందిలో 9 మందిని కాపాడవచ్చని WHO స్పష్టం చేసిందన్నారు. గోల్డెన్ అవర్‌లో సీపీఆర్ చేస్తే ఎంతోమందిని కాపాడవచ్చన్నారు. తెలంగాణలో ప్రతి సంవత్సరం కార్డియాక్ అరెస్ట్‌తో 24 వేల మంది చనిపోతున్నారన్నారు. గేటెడ్ కమ్యూనిటిలో ఉండే వారికి, మాల్స్‌లో, బస్తీల్లో ఉండే వారికి, గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉద్యోగులకు సీపీఆర్‌పై శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ప్రజల విలువైన ప్రాణాలు కాపాడటమే సీపీఆర్ ట్రైనింగ్ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం మనుషుల ఆహారపు అలవాట్లు మారాయని, ఇతర కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారని, దీని వల్ల సమస్యలు వస్తున్నాయని అన్నారు. 1200 AEDలను రూ.18 కోట్లతో కొనుగోలు చేయాలని వైద్యశాఖ నిర్ణయించిందని, రాబోయే రోజుల్లో AED కచ్ఛితంగా పెట్టాలనే నిబంధనలను తీసుకువస్తామని మాటిచ్చారు. మనిషికి పరిశుద్ధమైన గాలి, నీరు, ఆహారం కావాలని.. సీఎం కేసీఆర్ ఈ మూడింటిని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందిస్తున్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని మార్పులు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో చోటు చేసుకుంటున్నాయన్నారు. సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉంటే.. ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
Delhi Liquor Scam: బాహు’బలి’ మనీష్ సిసోడియా.. ఆప్‌పై బీజేపీ మీమ్ వైరల్
