Site icon NTV Telugu

కృష్ణా జలాల వివాదం: ఇద్దరి ముఖ్యమంత్రుల రాజకీయ డ్రామా

కృష్ణా జలాల వివాదంపై టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే రాజకీయ కోణంలో అనుమానించాల్సిన వస్తోందని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొట్టుకునే దిశగా ఇరు రాష్ట్రాల మంత్రుల తీరు ఉందన్నారు. ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాటలు చూస్తుంటే రాజకీయ రగడ పుట్టేటట్లు ఉన్నాయన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి భోజనాలు చేసే పరిస్థితి దాటి.. తిట్టుకునే పరిస్థితి చూస్తుంటే కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపినట్లు కనిపిస్తోందని జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలు జలవివాదాల్లో కొట్టుకున్న తరువాత పరిష్కారం దిశగా కేంద్రం వెళ్తాదా..? అని ఆరోపించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త డ్రామా ఆడుతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారనే ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా పార్టీ మారరన్నారు. కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే జల వివాదాలు ఉండవు అని జగ్గారెడ్డి తెలిపారు.

Exit mobile version