Suicide : హైదరాబాద్ నగరంలోని కేపిహెచ్బీ కాలనీలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే 9వ తరగతి విద్యార్థిని లాస్య ప్రియ (13) బాత్రూం కిటికీ నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే, మంజీరా ట్రినిటీ హోమ్స్‌లో 17వ అంతస్తులో నివాసముండే హరినారాయణమూర్తి కుటుంబానికి చెందిన లాస్య ప్రియ, అడ్డగుట్టలోని నారాయణ స్కూల్లో చదువుతోంది. సోమవారం జరిగిన పేరెంట్-టీచర్ మీటింగ్‌లో విద్యాభ్యాసంపై తగిన శ్రద్ధ చూపడంలేదని టీచర్లు తల్లిదండ్రులకు సూచించారు. దీని తర్వాత ఆమె మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
National Film Awards 2025: జై బాలయ్య.. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’!
సాయంత్రం నుంచి మౌనంగా ఉన్న లాస్య ప్రియ, రాత్రి 9 గంటల సమయంలో ఇంటిలోని బాత్రూం కిటికీ అద్దాలను తొలగించి కిందకు దూకింది. 17వ అంతస్తు నుండి పడిపోవడంతో తీవ్ర గాయాలతో మృతి చెందింది. శరీర భాగాలు విడివిడిగా పడిపోవడంతో అక్కడి వారంతా తీవ్ర షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
National Film Awards 2025: జై బాలయ్య.. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’!
