Tragedy : ఇది ప్రేమ పెళ్లి కాదు. కానీ, ఒక కొత్త జీవితంపై కలలు కంటూ అడుగుపెట్టిన నవ వధువు.. ఆ జీవితం బంధనంగా మారుతుందని ఊహించలేకపోయింది. భర్త వేధింపులతో ఆమె ఉక్కిరిబిక్కిరై, చివరకు ప్రాణాలు తీసుకునే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే యువకుడు KPHB లో ఓ ప్రైవేట్ షాపులో సెల్స్ మాన్‌గా పని చేస్తుంటాడు. అతడు, పూజిత అనే యువతిని ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రెండు నెలలకే పూజిత తన ప్రాణాలను తీసుకోవడం అందరినీ కలచివేస్తోంది.
Tragedy : గద్వాల జిల్లాలో మేఘాలయ తరహా మర్డర్.. తల్లితో కలిసి భర్తను..
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఈ మృతిచెందిన నవ వధువు భర్త శ్రీనివాస్ వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పూజితకు గతంలో కొన్నాళ్ల పాటు బంధువులతో కలిసి ఒక ఫంక్షన్ సమయంలో తీసిన ఓ వీడియోలో కూల్ డ్రింక్ తాగుతున్న దృశ్యం ఉంది. ఆ వీడియోను తీసుకుని, శ్రీనివాస్ ఆమెను తీవ్రంగా శారీరకంగా, మానసికంగా వేధించాడట. ఇదే కాదు, ఆ వీడియోను వాట్సాప్‌లో పంచుతూ కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ వీడియోను అడ్డంగా పెట్టుకుని అదనపు కట్నం తీసుకురావాలని పూజితపై తీవ్ర ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు.
ఈ వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతూ, ఆమెను క్లిష్ట పరిస్థితికి నెట్టాయి. ఈ ఒత్తిడి తాళలేక ఆమె నిన్న (జూన్ 22) హౌసింగ్ బోర్డులో తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పూజిత బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూజిత భర్త శ్రీనివాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు మొత్తం ఏడుగురు ఆమెను మానసికంగా వేధించారని ఆరోపించారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. శ్రీనివాస్ సహా మరికొంతమందిని అదుపులోకి తీసుకునే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు.
Rohit Sharma: మోకాలిపై కూర్చొని రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశా.. ఆమె నా అదృష్ట దేవత!
