Site icon NTV Telugu

Koti Deepotsavam 2025 Day 1: శివనామస్మరణతో మార్మోగిన ఎన్టీఆర్ స్టేడియం

Mukteswara Kalyanam

Mukteswara Kalyanam

Koti Deepotsavam 2025 Day 1: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ప్రతి ఏటా కార్తీకమాసంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా మొదటి రోజు కార్యక్రమం జరిగింది. వేలాదిగా పాల్గొన్న భక్తుల శివనామస్మరణతో వేదిక మార్మోగింది.

కార్తీకమాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా అంధకారాన్ని తొలగించి ఆత్మజ్యోతి ప్రకాశించనిచ్చే సంకేతంగా భావిస్తారు. కోటి దీపోత్సోవంలో మొదటి రోజులో భాగంగా.. దీప యజ్ఞం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాస్త్రి ప్రవచనామృతం వినిపించారు. ఆ తర్వాత.. వేదికపై సమస్త పుణ్య నదుల జలాలతో స్పటిక లింగానికి సహస్రకలశాభిషేకం, కోటి మలెల్ల అర్చన నిర్వహించగా.. భక్తులచే శివలింగాలకు కోటిమల్లెల అర్చన గావించారు.

అనంతరం కాళేశ్వరం శ్రీముక్తేశ్వరస్వామి కళ్యాణం కన్నుల పండువగా సాగింది. కళ్యాణ అనంతరం హంసవాహనంపై ఆదిదంపతులు భక్తులకు దర్శనం ఇచ్చారు. ముఖ్యంగా జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామిజీ (శృంగేరి శారదాపీఠం) వారిచే అనుగ్రహభాషణం భక్తులను అలరించింది. చివరలో సప్త హారతి, లింగోద్భావంతో మొదటి రోజు కోటి దీపోత్సవం వేడుక విజయవతంగా ముగిసింది. ప్రతి దీపం ఒక భక్తుని ఆత్మజ్యోతి అనే భావనను ప్రతిబింబించిన ఈ కోటి దీపోత్సవం, కార్తీకమాస భక్తి వైభవానికి నిదర్శనంగా నిలిచింది.

ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ఈనెల 13 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా..   ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే..

Indus Waters Treaty: గన్స్, మిస్సైల్స్ అవసరం లేదు.. పాకిస్తాన్‌ను దెబ్బతీయాలంటే “సింధూ” చాలు

Exit mobile version