Site icon NTV Telugu

Koppula Eshwar : జీవన్ రెడ్డి అధికారం కోసమే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు

Koppula Eshwar

Koppula Eshwar

జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి అధికారం కోసమే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు అని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదేపదే బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కాళేశ్వరం ప్రాజెక్టు పై, ఇరిగేషన్ వ్యవస్థపై నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా అని ఆయన అన్నారు. కేవలం అధికారం కోసమే జీవన్ రెడ్డి కేసీఆర్ పై బిఆర్ఎస్ ప్రభుత్వం పై విషం చిమ్మే మాటలు మాట్లాడుతూన్నారని మండిపడ్డారు. నీలాంటి సీనియర్ నాయకునికి తగదని హితవు పలికారన్నారు.

BJP: తెలంగాణపై హైకమాండ్ ఫోకస్‌.. కమలం పార్టీలో కీలక మార్పులు..?

పరిపాలన సౌలభ్యం కోసం నూతన కలెక్టరేట్ కార్యాలయాలను, నూతన ఎస్‌పి కార్యాలయాలను ఆధునిక హంగులతో నిర్మించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. 2014కు ముందు పరిపాలనను రూ.2014 తర్వాత పరిపాలనను ప్రజలు గమనించాలని, గత ప్రభుత్వాలు ఎందుకు ఇంత చేయలేకపోయానని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న పాలనను ఎన్నో రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు సుపరిపాలన పెద్ద పీట వేశాయని, ప్రజల వద్దకు పాలన అందించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామి అని, భవిష్యత్తు సవాళ్లకు సుపరిపాలననే ధీటైన జవాబు అని అన్నారు.

Exit mobile version