Site icon NTV Telugu

Koppula Eshwar : ప్రతి కార్యకర్త టీఆర్‌ఎస్‌లో ఉన్నందుకు గర్వపడాలి

పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రమాణ స్వీకారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమ పార్టీ అని, ప్రతి కార్యకర్త ఈ పార్టీలో ఉన్నందుకు గర్వపడాలని ఆయన అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు ఆ రాష్ట్ర నాయకులు సంక్షేమ ఫలాలు అందించడంలో ఏ ఒక్క రాష్ట్రం సక్సెస్ కాలేదన్నారు. మన తెలంగాణ రాష్ట్రం ప్రజలు కోరుకున్న దానికంటే ఎక్కువే ఇస్తున్న రాష్ట్రమని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాక ముందు పది సంవత్సరాలు పరిపాలించిందని, అప్పుడు టీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకోలేదని ఆయన వెల్లడించారు.

కానీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రానున్న రోజుల్లో మీకు గుణపాఠం చెప్తారు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ నాయకులు కేసీఆర్ మీద అ తెలంగాణ మీద ఉచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తాం తరిమి తరిమి కొడతామని ఆయన హెచ్చరించారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో కోటి యాభై లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటే బీజేపీ మాత్రం అవినీతి అంటూ తప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తోందని, దీన్ని కార్యకర్తలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.

https://ntvtelugu.com/tpcc-revanth-said-congress-flag-hoisted-over-golconda-fort/
Exit mobile version