Kunamneni Sambasiva Rao కక్కుర్తి పడి ఇక్కడ ఎవరు లేరన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సంచలన వ్యాఖ్యాలు చేశారు. కమ్యూనిస్టుల గురించి బీఆర్‌ఎస్ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని కునంనేని అన్నారు. బీఆర్‌ఎస్ తో ఎన్నికల్లో కలుస్తామా లేదా అనేది చర్చ లేదన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీతో పనిచేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ తో ఎన్నికల్లో కలుస్తామా లేదా అనేది చర్చ లేదన్నారు. జిల్లా.. మండల స్థాయి సీపీఐ.. సీపీఎం నేతల సమ్మేళనం ఉంటుదని, ఏప్రిల్ 9 న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మోడీ లాగా ఇప్పటి వరకు దిగజారి ఏ ప్రధాని ప్రవర్తించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని అనర్హత వేటు వేసి.. బీసీని తీసుతున్నారు అని అంటున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థ మీద ఇంకా జనంలో నమ్మకం ఉందని, గుజరాత్ లో ఇటీవల వచ్చిన మూడు జడ్జిమెంట్ లు విచిత్రంగా ఉందన్నారు.
Read also: Tammineni Veerabhadram: షర్మిలపై తమ్మినేని సీరియస్.. రాజకీయ నాటకాలు మానుకోవాలని..
డిగ్రీల తో పనేంటి అనడం దుర్మార్గమైన చర్య అన్నారు. అఫిడవిట్ కి విలువ ఏముంటుంది మరి? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ కి ఫైన్ వేయడం ఏంటి.? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీ.. మోడీ ల పేర్లు ప్రస్తావిస్తే శిక్ష వేయడం ఏంటి..? అని మండిపడ్డారు కూనంనేని. తెలంగాణ లో బీజేపీ వి దొంగ పోరాటాలని సంచలన వ్యాఖ్యాలు చేశారు. పేపర్ పోరాటాలు, మాకా పోరాటాల గురించి చెప్పేది అంటూ మండిపడ్డారు. పనికి మాలిన మాటలు మాట్లాడటం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ .. బీఆరేస్సే… లెఫ్ట్ లేఫ్ట్ .. ఎవరి పార్టీ వాళ్లవి అని అన్నారు. మేము ఇద్దరం ఎటు మద్దతు ఇస్తే అటు 40 సీట్లు గెలిపించే బలం ఉందని అన్నారు. మునుగోడులో బీఆర్‌ఎస్‌కి బీజేపీని అడ్డుకోవడం కోసం మద్దతు ఇచ్చామన్నారు. సీపీఐ.. సీపీఎం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.
Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే రాలేదు..!