Site icon NTV Telugu

Konda Vishweshwara Reddy : బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Konda vishweshwar Reddy

Konda vishweshwar Reddy

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదారాబాద్‌ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల సీఎంలతో పాటు, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు సహా ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. అయితే గత రెండు రోజులుగా జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలు నేటితో ముగిశాయి. అయితే ఈ నేపథ్యంలోనే పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హాజరైన అతిరథమహారథులు పాల్గొన్నారు. అయితే ఈ బహిరంగ సభలోనే కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలోకి చేరారు.
గత కొంతకాలంగా ఏ పార్టీలో చేరాలన్న దానిపై డైలామాలో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి సర్వేలు చేయించి చివరికి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

కాగా 2013లో టీఆర్ఎస్ లో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. 2014 ఎన్నికల్లో చేవెళ్ళ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. 2018 నవంబర్లో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే 2019ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయారు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి.

 

Exit mobile version