కొండా సురేఖ.. తెలంగాణ రాజకీయాల్లో ఆమె సంచలనం. ఆమె పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో తమ రాజకీయ ప్రస్థానం గురించి ఆమె క్లారిటీ ఇచ్చారు. తాము పార్టీ మారడం లేదని కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చేశారు కొండా కపుల్. వరంగల్ తూర్పు మాదే..పార్టీ మరే ప్రసక్తే లేదు.. ఇది అంతా గిట్టని వల్ల ప్రచారం అంటూ కొట్టిపారేశారు. అత్యంత వైభవంగా జరిగిన కూతురు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా స్పష్టం చేశారు కొండా దంపతులు.
వరంగల్ తూర్పులో కొండా సురేఖ బరిలో ఉంటుంది .. మరో సీటు ఇస్తే. మా కుటుంబంలో ఇద్దరం రెడీగా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో స్థానం లో కాంగ్రెస్ కి కష్టంగా ఉన్న స్థానంలో పోటీలోకి దిగేందుకు కూడా రెడీనే అన్నారు. ఈ మధ్యకాలంలో పత్రికలలో న్యూస్ ఛానల్స్‌లో కొండా సురేఖ మురళీధర్ రావు దంపతులు బీజేపీ లో చేరుతున్నారు అటువంటి కథనాలు చాలా రావడం జరుగుతుంది అటువంటి అవాస్తవమైన వాటిని నమ్మవద్దని కొండా దంపతులు స్పష్టం చేశారు .
ప్రజలను అయోమయానికి గురిచేయవద్దన్నారు. తాము వేరే పార్టీలోకి వెళ్లడం లేదని తాము నమ్ముకున్న కాంగ్రెస్ జెండా కిందనే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని రానున్న ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ పోటీ చేస్తున్నారన్నారు కొండా మురళి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే అధికార పార్టీ నాయకులు చేసే నీచ రాజకీయాలను నమ్మవద్దని రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కొండా దంపతులు ఒక్క వరంగల్ తూర్పు నియోజకవర్గం మాత్రమే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని నాయకులని గానీ అధికార పార్టీ వాళ్లు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా వాళ్ల కష్టసుఖాల్లో ఆపదలో కాపాడు కోవడానికి ముందుంటామని పేర్కొన్నారు.
