NTV Telugu Site icon

Komatireddy Venkatreddy:ఈసారి అసెంబ్లీకీ.. బర్త్ డే సాక్షిగా మనసులోమాట

Komati 1

Komati 1

కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ కాంగ్రెస్ లో ఆయనో సంచలనం. ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా కీలక విషయాలు పంచుకున్నారు. తాను మచ్చలేని రాజకీయా నాయకుడిని అని చెప్పుకొచ్చారు మాజీమంత్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 20ఏళ్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్న తాను ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉన్నానని గుర్తుచేసారు.

వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగానే బరిలోకి దిగుతానని ఆయన కార్యకర్తలకు స్పష్టం చేసారు. తాను అధికారపార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఏనాడు ప్రతిపక్ష కార్యకర్తలను కేసులపాలు చేయలేదని… భూములు లాక్కోలేదని ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేను పరోక్షంగా ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన పుట్టినరొజు సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు కార్యకర్తలు భారీగా ఘన స్వాగతం పలికారు. మునుగోడు, నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల నుండి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు.

తనపుట్టిన రోజు సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మూడు సంవత్సారాలుగా నియోజవర్గం వైపు కన్నెత్తి చూడని వెంకట్ రెడ్డి తాజాగా నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభించడం, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2019లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీప టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య పై గెలిచారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై డాక్టర్ బురా నర్సయ్య గౌడ్ 30,494 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ప్రతాపం చూపించారు. కోమటిరెడ్డికి 5లక్షల32 వేల 795 ఓట్లు లభించాయి. సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కి 5లక్షల 27వేల 576 ఓట్లు వచ్చాయి. ఈసారి అసెంబ్లీకి పోటీచేస్తానని ముందే ప్రకటించడంతో అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇస్తుందోనని ఆసక్తి నెలకొంది.

Tollywood: హీరోల్లో మార్పు వస్తుందా..? బడ్జెట్స్ తగ్గుతాయా..?