Site icon NTV Telugu

Palvai Sravanthi: ఫొటో మార్ఫింగ్ చేసి నన్ను ఓడించారు

Palvai Sravanthi Nalgonda

Palvai Sravanthi Nalgonda

Palvai Sravanthi: మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫలితాలపై కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఓటమికి గల కారణాలు, జరిగిన తప్పులపై చర్చించారు. కేవలం డబ్బు, మద్యం పంచి అధికారపార్టీ ఎన్నికల్లో విజయం సాధించిందని స్రవంతి ఆరోపించారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రెస్ మీట్ మట్లాడిన ఆమె సీఎం ను కలిసినట్లు ఫొటో మార్ఫింగ్ చేసి నన్ను ఓడించారన్నారు. రెండు పార్టీలు దన బలంతో, మద్యం పంచి, ప్రలోబాలకు గురిచేసి, బెదిరించి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. బీజేపి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు ఓటర్లను కల్తీ మద్యం పంచి వారీ ఆరోగ్యంతో చెలగాటం ఆడారని అన్నారు. ఉప ఎన్నిక ప్రజల కోసం జరగలేదని అన్నారు. ఎన్నికల కమిషన్ కూడా తన విధిని సక్రమంగా నిర్వహించలేదని ఆరోపించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా వుంటానని ఆమె హామీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొవర్టు రాజకీయాలు చేసారని మండిపడ్డారు. అధిష్టానం ఈవిషయాన్ని గుర్తించిందని, వారిపై చర్యలు ఉంటాయీ అన్న విశ్వాసం నాకు ఉందని అన్నారు.

Read also: Bigg boss: గీతూపై నెటిజన్స్ ఫైర్… ఎందుకంటే!?

కాగా.. మునుగోడులో ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేకపోయింది…ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇక,మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే వరకు విజయం ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఎర్లీ ట్రెండ్స్‌తోనే తాము ఓడిపోతున్నామని గ్రహించింది. కానీ డిపాజిట్ కూడా దక్కకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశను నింపింది. మహిళల్లో ఆమె సానుభూతి సంపాదించుకుంటున్నట్టుగా కనిపించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా మునుగోడులో కాపాడుకుంటూ వచ్చిన ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమైంది. మరి ఈ వరుస ఎదురుదెబ్బలను తట్టుకుని.. తెలంగాణలో కాంగ్రెస్ పటిష్టంగా నిలదొక్కుకుంటుందో వేచిచూడాలి.

Exit mobile version