Site icon NTV Telugu

Komatireddy: కేసీఆర్ గురించి మాట్లాడటమే వేస్ట్.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Komati Reddy Kcr

Komati Reddy Kcr

Komatireddy: కేసీఆర్ గురించి మాట్లాడటమే వేస్ట్.. రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కి ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పులేదన్నారు. కేసీఆర్ గురించి చెప్పాలంటే రామాయణం అంత ఉంటదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గురించి మాట్లాడి వేస్ట్ అన్నారు. సచ్చిన పాము కేసీఆర్ అన్నారు. దళితుడు తొలి సీఎం..లేదంటే తలనరుక్కుంటా అన్నాడు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మాటలు దేశంలో ఎవరు అనలేదన్నారు. దళితులను మోసం చేసిన కేసీఆర్.. కాళేశ్వరం నుండి లిక్కర్ వరకు అవినీతే అన్నారు. కేసీఆర్ ఇంట్లో ఉన్న ఒక్కొక్కరి మీద 5వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. టానిక్ పేరుతో..ఒక్క అనుమతితో పదుల షాపులు నడిపాడన్నారు.

Read also: Komatireddy: మోడీ ..అచ్చేదిన్ తెస్తా అనే పేరుతో ప్రధాని అయ్యారు..

కేసీఆర్ బాషా మారడం లేదు..ఆ బాషా ఆయాన నేర్పిండే అన్నారు. 48 గంటలు కాదు..ఆయన్ని ప్రచారం చేయకుండా నిషేదించాలని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన దీక్ష దొంగ దీక్ష చేశారని మండపడ్డారు. ఇంజెక్షన్ లు తీసుకుని దీక్ష చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ డాక్యుమెంట్ లు కూడా ఇస్తున్న అన్నారు. హరీష్ రావు.. డ్రామా రావు.. రాజీనామా రెండు పేజీలు రాసుకుని వచ్చాడని తెలిపారు. సింగిల్ లైన్ లో ఉంటే.. రాజీనామా లేఖ అన్నారు. కేసీఆర్ వెస్ట్ ఫెలో.. అలాంటి వెస్ట్ ఫెల్లో గురించి మాట్లాడటం టైం వెస్టు అంటూ మండిపడ్డారు. నడవనే వస్థలేదు ఆయనకు.. ఆయన దగ్గరికి 25 మంది ఎమ్మెల్యేలున్నారు..? నీ దగ్గర ఉన్నోల్లే నా దగ్గరికి వస్తున్నారు. జూన్ 5 తేదీ కేసీఆర్ దగ్గర ఉన్న 25 మంది మా దగ్గరికి వస్తారన్నారు. మీ దగ్గరకు వచ్చే వాళ్ల పేర్లు చెప్పు.. మా దగ్గరికి వచ్చే వాళ్ళ పేర్లు చెప్తా అన్నారు. ప్రజ్వల్ రెవన్న తో కవిత పోల్చుకోవడం ఏంది? వాడు గాలీజు పని చేసి దొరికిండు అన్నారు. వాడితో కవిత పోల్చుకుంటుంది.. నవ్వొచ్చింది నాకు అన్నారు.
Read also: Shopping Malls: మెట్రో నగరాల్లో వెలవెలబోతున్న షాపింగ్‌ మాల్స్‌

Kcr వి పిట్టల దొర మాటలు అన్నారు. వర్ష కాలం ఎవడ్రా సీఎం.. కేసీఆర్ ? అని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట మీద ని ఫోటో..కారు ఫోటో వేయించుకున్నావు అన్నారు. పాపం తగిలిందన్నారు. కరవు వచ్చింది కారణం నువ్వే అన్నారు. రెండు సీట్లలో డిపాజిట్ తెచ్చుకో కేసీఆర్ అని సవాల్ విసిరారు. సచ్చిన పాము ని ఎక్కువ చంపడం ఎందుకు.. బిడ్డ బెయిల్ కోసం 7 సీట్లు గెలిపిస్తాం అని బీజేపీ కి మాట ఇచ్చారన్నారు. డమ్మీ అభ్యర్ఫిని పెట్టారని తెలిపారు. కేసీఆర్.. మోడీ వేరు వేరు కాదు.. ఇద్దరు ఒక్కటే అన్నారు. ప్రగతి భవన్ ఫలక్ నుమా ప్యాలెస్ కంటే బాగుందన్నారు. నిజాం ప్యాలెస్ కంటే బాగుందన్నారు. దాని నుండి.. నంది హిల్స్ కి రావడంతో కేసీఆర్ కి మెంటల్ ఎక్కిందన్నారు. బీఆర్ఎస్ కి ఇచ్చిన 11 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Venkat Reddy: మాది RR కాదు.. మీది AA.. మోడీకి కోమటిరెడ్డి సెటైర్‌

Exit mobile version