Komatireddy Venkat Reddy: నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటైందని, ఇది అదృష్టంగా భావిస్తున్నా అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లాలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. కుల రహిత సమాజం కోసం జీవితాంతం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల నేత డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని అన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ కేవలం దళితుల కోసమే కాదు అన్ని వర్గాల వారి అభ్యున్నతి గురించి ఆలోచించిన మహనీయుడని తెలిపారు.
Read also: Modi Warangal Tour: మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం..! హాజరవుతారా? లేదా?
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగం ఇంత పురోగతి సాధించిందంటే అది జగ్జీవన్ రామ్ ముందుచూపు వల్లే అని తెలిపారు. ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నల్గొండలోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించామన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ విగ్రహం ఏర్పాటైందని అన్నారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు, నాయకులు నడవాలని సూచించారు.
Nepal: భారత వ్యాపారవేత్తపై ప్రధాని పుష్పకమల్ దహల్ కామెంట్స్.. రాజీనామా చేయాలని డిమాండ్స్..