Komatireddy Venkat Reddy : తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. నాకు తెలియకుండానే GO విడుదలైందని ఆయన తెలిపారు. నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరూ కూడా టికెట్ల ధరల పెంపు కోసం మమ్మల్ని సంప్రదించవద్దు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక కుటుంబం సినిమా చూడాలంటే టికెట్ల ధరలు తగ్గాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టికెట్ల ధర పెంచబోమని నేను గతంలో అసెంబ్లీలో కూడా చెప్పాను అని మంత్రి గుర్తు చేశారు.
Akhanda 2: ఆలస్యమైనా తగ్గని ‘అఖండ 2’ హవా: నార్త్ రెస్పాన్స్ సూపర్ క్రేజీ?
సినిమా టికెట్ల ధరల పెంపు కోసం ఎటువంటి దరఖాస్తులు తీసుకోకూడదని తాను ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి ఆదేశించానని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలియజేశానని ఆయన వెల్లడించారు. తాజాగా విడుదలైన ‘అఖండ 2’ సినిమా టికెట్ల ధరలు పెంచిన విషయం తనకు తెలియదని మంత్రి పేర్కొన్నారు. తాను గత కొన్ని రోజులుగా ఫ్యూచర్ సిటీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఏర్పాటు చేయనున్న ఫిల్మ్ సిటీ గురించి, తన నియోజకవర్గంలోని ఎన్నికల పనుల్లో బిజీలో ఉన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.
Duvvada, Madhuri : అందుకే పార్టీకి వెళ్లాం.. ఫామ్‌హౌస్ పార్టీ వ్యవహారంపై దువ్వాడ, మాధురి క్లారిటీ
