తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆ తరువాత కేంద్రం ప్రభుత్వం, బీజేపీ నేతలపై నిప్పులు చేరిగారు కేసీఆర్.అంతేకాకుండా ప్రభుత్వం రద్దుకు సిద్ధమంటు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ధైర్యం వుంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీకి గ్రామస్థాయిలో కార్యకర్తలు లేరంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల ముందు గొఱ్ఱెలు, బర్రెలు గుర్తుకు వస్తాయి, గెలిచిన తరువాత మరిచిపోవడమే కేసీఆర్ నైజం. 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా గ్రామాలను అభివృద్ధి చేయలేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. గ్రామ పంచాయితీలలో నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదు.
కాంగ్రెస్ కార్యకర్తలపై చేయి పెడితే ఆ చేయి నరికి వేస్తామని అధికార పార్టీ నాయకులను హెచ్చరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. బీజేపీ, టీఆర్‌ఎస్ రైతుల పట్ల కపట ప్రేమ నటిస్తున్నారు అని తీవ్రంగా ధ్వజమెత్తారు.
