NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌ సీట్లు సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Konatireddy: 70 సీట్లు అనుకున్నాం కానీ ఎప్పుడైతే కాంగ్రెస్‌ మేనిఫెస్టోని కేసీఆర్‌ కాపీ కొట్టారో అప్పుడు 75 అయిందని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక విజభేరికి కాంగ్రెస్‌ సీట్లు పెరగడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ సీట్లు సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. కేసీఆర్‌ కు సింగిల్‌ డిజిట్‌ అవుతుందని పరిషాన్‌ కావాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రూప్‌2 విద్యార్థిని ప్రవళిక కుటుంబాన్ని కలవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవళిక కుటుంబానికి ఆర్ధిక సహాయం చేస్తామని అన్నారు. ప్రవళిక కుటుంబాన్ని ఆదుకుంటామని, రూ.2లక్షల ఆర్ధిక సహాయం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రవళిక కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రకటించాలని ప్రవళిక కుటుంబానికి కలిసేందుకు వెళుతున్నప్పుడు ప్రయాణం మధ్యలో ఆక్సిడెంట్‌ అయి ఇద్దరు యువకులు చనిపోతే వారిని కాపాడేందుకు నిలిచిపోవాల్సి వచ్చిందని దాని కారణంగా రామన్నకోటకు పోవడం జరిగిందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుద్యోగులారా 45రోజుల ఆగండి.. తొందరపడొద్దు. ఆత్మహత్యలు కరెక్ట్‌ కాదని మీడియా ద్వారా నిరుద్యోగులకు కోమటి రెడ్డి సూచించారు. పదిఏళ్లు నిరుద్యోగ నరకాన్ని అనుభవించారు.. ఒక్క 45 రోజులు ఆగాలని సూచించారు. ఫీజు రీయంబెర్స్‌ మెంట్ లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. ఒక్క డిఎస్‌ సీ నోటిఫికేషన్‌ లేదు. సుమారు 70వేల మంది టీచర్లు రిటైర్‌ అయ్యారు. ఆరువేల స్కూల్లు మూతపడ్డాయని గుర్తుచేశారు. ఇవాళ టీఎస్‌పీసీ ఎగ్జామ్‌ కండెక్ట్‌ చేయలేనివారు లేరని అన్నారు. ఇలాంటి వారు రాష్ట్రాన్ని పాలించే హక్కువుందా? అని ప్రశ్నించారు. ప్రవళిక ఐదు పరీక్షలు రాసింది. పోలీసు ఆఫీసర్లుతో ఏం మాటలు చెప్పించారు? అని మండిపడ్డారు. ప్రేమ వ్యవహారంతోనే ఆత్మహత్య అని చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ ఏమో రాజకీయం చేస్తున్నారు అందతా వేరే అంటున్నారు. ఉద్యోగం కాదు.. నీ మూలంగా చనిపోయిన ప్రవళిక మాక్కావాలి.. తెచ్చిస్తావా? అని ప్రశ్నించారు. ప్రవళికనే కాదు 32 మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలో ఎక్కడైనా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారా? మొదటి రాష్ట్రం తెలంగాణ అని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ బాగా ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్‌ ను గెలిపించాలని కోరారు. మేము కొట్టుకుంటున్నామా.. వాళ్లు కొట్టుకుంటున్నారా? కోమటి రెడ్డి ప్రశ్నించారు. రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదు బీఆర్‌ఎస్‌ లు అయితాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌ ప్లానింగ్‌ రొటీన్‌కి భిన్నంగా ఉండబోతోందా?