Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : యాదాద్రి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం

తెలంగాణా ప్రభుత్వ నిర్లక్ష్యం, కావలసిన నిధులు మంజూరు చేయకపోవడంతో బహుళ మోడల్ రవాణా వ్యవస్థ (Multi Model Transport System) రెండవ దశ పనులు నిలిచి పోయాయని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ఈ పనులు త్వరిగతినా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈరోజు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. రెండవ దశలో రైళ్లు రాయగిరి (భువనగిరి జిల్లా) వరకు పొడిగించుటకు
కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారుచేసి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు మంజూరు చేయని కారణంగా పనులు ముందుకు సాగటంలేదన్నారు.

అయితే దీనిపై కేంద్రమంత్రి చాలా అనుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. దీనిమీద వెంటనే తగు అనుమతులు మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధార పడకుండా రెండవ దశ పనులు త్వరిత గతిన మొదలు పెట్టిస్తామని భరోసా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ మార్గం నిర్మించుట వలన, యాదాద్రికి చేరుకునే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని ఆయన అన్నారు.

Exit mobile version