Site icon NTV Telugu

Komatireddy Venakt Reddy : వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే..

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

మిర్యాలగూడ పట్టణంలో టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి పార్లమెంట్ స‌భ్యులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఎవరు ఎన్ని తప్పుడు సర్వేలు రాయించుుకున్నా.. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఆదరణ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్ కు గొర్రెలు, బర్రెలు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయిన ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని, ధనిక రాష్ట్రమైన తెలంగాణాను కేసీఆర్‌ అప్పుల ఊబిలోకి నెట్టాడని ఆయన ఆరోపించారు.

ప్రజాదరణ, పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్నవారికి.. సర్వేల ప్రకారం టికెట్లు కేటాయిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్టు పనులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మా కార్యకర్తలను బెదిరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు తన బంధువులైన పోలీస్ అధికారులను తెచ్చుకొని కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ మొత్తం పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు.

 

Exit mobile version