NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : విభజన చట్టంలో మిగిలి పోయిన సమస్యలు సాధించాలి

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

విభజన చట్టంలో మిగిలి పోయిన సమస్యలు సాధించాలన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, ఛార్జ్ తీసుకున్న మూడో రోజే నేను తెలంగాణా భవన్ ను పరిశీలించానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. ఢిల్లి లోనిఆంధ్ర భవన్ విభజన పై స్పష్టత వచ్చిందని, హైదారాబాద్ హౌజ్ పక్కన తెలంగాణ భవన్ నిర్మాణం జరగనుందన్నారు. ఇప్పటికే కొన్ని మోడల్స్ పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఫైనల్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. రెండు నెలల్లో డిల్లీలో తెలంగాణ భవన్ కు టెండర్లు పిలుస్తామని, ఢిల్లీలో భవన నిర్మాణాల అనుమతులకు కొంత సమయం పడుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. త్వరగా అనుమతులు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రధానంగా బీవోటీ కన్సెషనరీ జీఎంఆర్ సంస్థ వివాదం పరిష్కరం కోసం ఎదురుచూడకుండా హైదరాబాద్ – విజయవాడ NH-65 రోడ్డు నిర్మాణ పనులను ఆరు లేన్లుగా నిర్మించాలని కోరారు. వాహనాల రద్దీ కారణంగా ప్రమాదాల్లో చనిపోతున్న అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాన్నారు. అలాగే NH-163 (హైదరాబాద్ – మన్నెగూడ) రోడ్డుకు ఉన్న NGT సంబంధిత సమస్యకు సత్వర పరిష్కారాన్ని కనుగొనాలని కోరారు. ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్న నాలుగు లేన్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అధిక వాహన రద్దీ మూలంగా.. తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్న NH-765 (హైదరాబాద్ – కల్వకుర్తి) రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మించేందుకు కావాల్సిన డీపీఆర్ (DPR) తయారీ ప్రక్రియని వేగవంతం చేయాలని సంస్థ ఛైర్మన్‌ను సంతోష్ కుమార్‌ను కోరారు. తక్షణమనే DPR తయారీ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.