Site icon NTV Telugu

Komatireddy Rajgopal Reddy : అప్పులు ఇచ్చే స్థాయి నుంచి తెచ్చుకునే స్థాయి వచ్చాం

Congress MLA Raja Gopal Reddy countered the remarks made by Minister Harish Rao in the Telangana Assembly sessions.

తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల రాష్ట్రాంగా మారిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో అధికారి పార్టీపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రశ్నలు, విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. హరీష్ చాలా తెలివి కలిగి నోడివి, కాంగ్రెస్‌ వాళ్లు తెలివి తక్కువ వాళ్ళు అని అంటున్నారు, మాకు తెలివి లేకుండానే సోనియా గాంధీతో తెలంగాణ ఇప్పించామా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన వాళ్ళ పై ఇట్లనా మాట్లాడేదని ఆయన ఫైర్‌ అయ్యారు.

రాజగోపాల్‌ మాట్లాడుతుండగానే మంత్రి ప్రశాంత్‌ రెడ్డి స్పందిస్తూ.. హైదరాబాద్ నీ కేంద్రపాలిత ప్రాంతం చేస్తా అంటే… ఒప్పుకుంది కాంగ్రెస్ వాళ్ళు అని కౌంటర్ ఇచ్చారు. దీనిపై రాజగోపాల్‌రెడ్డి సభలో మీకో న్యాయం.. మాకో న్యాయమా..? అంటూ వ్యాఖ్యానించారు. బాధ అనిపించినప్పుడు మాట్లాడతామని, తెలివి లేనోల్లు అని అనడం బడ్జెట్ లో పదమా..!? అని ఆయన మండిపడ్డారు. అప్పులు చేయొద్దు అని కాదు అనవసరంగా అప్పులు తేవొద్దు అంటున్నామన్నారు. అప్పుల్లో పక్క రాష్ట్రం నుండి పోల్చుకో వద్దని, మనం ఇతర రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే పరిస్థితి నుండి… అప్పులు తెచ్చే వరకు వెళ్ళామని ఆయన విమర్శించారు. పవర్ ప్లాంట్స్ ఎందుకు… తక్కువ ధరకు విద్యుత్ వస్తున్నప్పుడు, అనవసరంగా అప్పులు తేకండి, ఎనిమిది యేండ్ల తర్వాత ఆరోగ్యం.. ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని ఆయన సెటైర్లు వేశారు.

https://ntvtelugu.com/ministe-harish-rao-setaire-to-etela-rajender/
Exit mobile version