Komatireddy Raj Gopal Reddy: బీజేపీ నుండి పోటీ చేసినప్పుడు నన్ను చూసే ఓటర్లు ఓటు వేశారు… బీజేపీ ని చూసి కాదని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా చండూర్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు తప్ప ఏ పార్టీ ఓటేసినా అది బీజేపీ కి వేసినట్టే అన్నారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికోసమే గతంలో రాజీనామా చేశా అన్నారు. బీజేపీ నుండి పోటీ చేసినప్పుడు నన్ను చూసే ఓటర్లు ఓటు వేశారు కానీ.. బీజేపీని చూసి కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత నెరవేర్చి తీరుతా అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తా అన్నారు. ఆగస్టు 15 లోపు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు.
Read also: Vijayawada Crime: బెజవాడలో విషాదం.. డాక్టర్ ఫ్యామిలీలో సూసైడ్..? ఐదుగురు మృతి
ఖమ్మం కూసుమంచి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కార్నర్ మీటింగ్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అర్హులైన వారందరికీ తెల్ల కార్డు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి పేదవాడికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం జరిగిందన్నారు. రైతన్నలకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం పరిపాలించిన పెద్దాయన మాయ మాటలు చెప్పి కర్ర పట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నాడని తెలిపారు. ఒకసారి కర్రు కాల్చి వాత పెట్టా మల్ల ఒక్కసారి కర్రి కాల్చి వాత పెట్టి మన విలువ అర్థమవుతుందన్నారు.
Read also: Raashii Khanna: ట్రెండీ అందాలతో మెరిసిపోతున్న రాశి ఖన్నా…
పార్లమెంటులో హక్కుల కోసం, అభివృద్ధి కోసం పోరాడే వారు కావాలని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి అన్నారు. రాజ్యాంగాన్ని చదవని వారు కూడా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. స్థానికేతరులు అనే విమర్శ అర్థం లేదన్నారు. దేశ వ్యాపితంగా బీజేపీ అబద్దాల ఆడుతోందన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అబద్దాల ఆడుతోంది బీజేపీ అని మండిపడ్డారు. పరీక్షలు కూడా నడుపలేని కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.