That’s why I stay away from Congress Party Says MLA Raj Gopal Reddy.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎన్టీవీ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అధిష్టానం నిర్ణయాల వల్లనే పార్టీ కి దూరంగా ఉంటున్నానని ఆయన వెల్లడించారు. తెలంగాణ కోసం కొట్లాడి వాళ్లకు పదవులు ఇవ్వాలని, టీడీపీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తే ఏం లాభం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరు అనేది తెలియకపోతే ఎలా..? అని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్గతంగా ఎవరితో విభేదాలు లేవని, రేవంత్ రెడ్డితో వ్యక్తిగత విభేదాలు కూడా లేవన్నారు.
కెపాసిటీ ఉన్నొళ్లకు పదవులు ఇవ్వాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లకు ప్రాధన్యత ఇవ్వాలని, అలా చేయకపోతే పాత కాంగ్రెస్ నాయకులు దూరం అవుతారని ఆయన హెచ్చరించారు. మా లాంటి వాళ్లకు గుర్తింపు ఇవ్వలేదని, కాంగ్రెస్ లో మొదటి నుండి ఉన్న వాళ్లకు అవకాశాలు ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
