NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: సజ్జల వ్యాఖ్యలు సరైనవి కావు

Sajjala Komatireddy

Sajjala Komatireddy

Komatireddy Venkat Reddy: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్‌ అయ్యారు. రెండు రాష్ట్రాలు కలపడం సాధ్యం కాదని, వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. నల్లగొండ జిల్లాలో మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ముగ్గురు మెడికల్ విద్యార్థులకు 75వేల ఆర్థిక సహాయం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంబీబీఎస్ పూర్తయ్య వరకు ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నల్లగొండ నియోజకవర్గం నుండి ఇప్పటికి ఏ కష్టం వచ్చినా నాకే బాధితులు, స్థానికులు ఫోన్ చేస్తున్నారు.. వారిని అన్ని రకాలుగా ఆదుకుంటున్న అండగా ఉంటా అన్నారు. రైతులు సాగునీటి కష్టాలు కూడా నా దృష్టికి తీసుకువస్తున్నారు వాటినీ పరిష్కరిచానన్నారు. నల్లగొండ నియోజకవర్గానికి రెగులర్ గా వస్తాను, అందుబాటులో ఉంటానని అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో విలువైన ప్రభుత్వ భూముల్లో పార్టీ ఆఫీస్ లు కడుతున్నారని తెలిపారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ భవనాలునా హయాంలోనే నిర్మాణాలు జరిగాయని తెలిపారు.

Read also: Nadendla Manohar : జాబ్ క్యాలెండర్‌ పేరుతో ప్రభుత్వం మోసం చేసింది‌

వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుండే పోటీ చేస్తా.. ఎవరికి అనుమానాలు అవసరం లేదన్నారు. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన నల్లగొండ నియోజకవర్గ ప్రజలను మరవను, వారికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. సీఎం దత్తత తీసుకున్న నల్లగొండ నియోజకవర్గంలో ఎందుకు డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం జరగడంలేదన్నారు. వెంటనే డబల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులకు డ్రా తీసి ఇవ్వాని, TRS వాళ్లకు మాత్రమే దళిత బంధు ఇస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఢిల్లీలో హై పవర్ కమిటీలు చాలా వున్నాయని, మంత్రి పదవికే రాజీనామా చేశా? నాకు పదవులు ముఖ్యం కాదన్నారు. పేదలు, కార్యకర్తలు నాకు ముఖ్యమన్నారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. రాజకీయాలు మాట్లాడను, ఎన్నికలకు నెల రోజుల ముందు రాజకీయాలు మాట్లాడతా అంటూ తెలిపారు. అయితే ఉమ్మడి రాష్ట్రంపై సజ్జల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి ఆయన మాటలు సరైనవి కాదంటూ కొట్టిపారేశారు.

Read also: Pawan Kalyan : ఉస్తాద్ భగత్‌సింగ్‌ ముహుర్తం ఫోటోలు

అయితే తాజాగా.. రాష్ట్ర విభజన తీరుపై సుప్రీంకోర్టులో వ్యాజ్యంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వీలైతే ఏపీని మళ్లీ కలపడమే తమ పార్టీ విధానమని, రెండు రాష్ట్రాల విలీనాన్ని ముందుగా స్వాగతించేది వైసీపీయేనని సజ్జల స్పష్టం చేశారు. ఇప్పుడు కాదని, ఎప్పుడైనా సమైక్య రాష్ట్రానికి ఓటేస్తానని, ఏ వేదికపైనైనా అదే చెబుతానని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం, పార్టీ వైఖరి ఇదేనంటూ సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Komatireddy Venkat Reddy: సజ్జల వ్యాఖ్యలు సరైనవి కావు