Site icon NTV Telugu

Komatireddy Rajagopal Reddy: చర్లగూడెం ప్రాజెక్ట్ వద్ద భూ నిర్వాసితులతో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy: నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం చర్లగూడెం ప్రాజెక్ట్ వద్ద భూ నిర్వాసితులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. భూనిర్వాసితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ మొదలు పెట్టి పదేళ్లు పూర్తి పూర్తయిందన్నారు. నీళ్లు ఎక్కడి నుండి వస్తాయో తెలియకుండానే కేసీఆర్ ప్రాజెక్టు మొదలుపెట్టారని ఆయన విమర్శించారు.

Read Also: KCR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

గత ప్రభుత్వం తొందరపాటు చర్యలతో నిర్వాసితులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. వర్షం నీటితో నిండేది కాదు ఈ ప్రాజెక్టు… ప్రాజెక్ట్ పూర్తయినా ఈ ప్రాజెక్ట్‌కు నీళ్లు రావని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రభుత్వం ఆరువేల కోట్లు ఖర్చు చేసిందని.. కట్ట పనులు ఆపాలంటూ నిర్వాసితులు అడ్డుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కట్ట పూర్తి చేయడం వల్ల మీ గ్రామానికి నష్టం వాటిల్లదని.. ఆర్ అండ్‌ ఆర్ ప్యాకేజీ రాని వారికి ఇప్పించే బాధ్యత తనదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని ఒప్పించి ఇబ్రహీంపట్నంలో ఇంటి స్థలాలు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. లేదంటే చింతపల్లిలో ఇప్పిస్తామన్నారు.

Exit mobile version