NTV Telugu Site icon

Student Die: ఫుడ్ పాయిజన్తో విద్యార్థి మృతి.. 10 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను ఆపేసిన పోలీసులు

Food

Food

Student Die: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని శైలజ ఫుడ్ పాయిజన్ వల్ల ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో విద్యార్థిని శైలజ మృతదేహాన్ని వాంకిడి మండలం దాబా గ్రామంలోని ఇంటికి తీస్కోని రాగా అంబులెన్స్ నుంచి దించనివ్వకుండా బంధువులు అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి మృతురాలి కుటుంబానికి ప్రభుత్వపరంగా హామీ ఇచ్చే వరకు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ హామీతో బాలిక పార్థివ దేహాన్ని ఇంట్లో సందర్శన కోసం ఉంచారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. వాంకిడి వైపు వెళ్ళే వారిని చెక్ చేసి పంపిస్తున్నారు.

Read Also: RCB Team: పూర్తిగా మారిన ఆర్‌సీబీ టీమ్.. హిట్టర్స్ వచ్చిన వేళ కలిసొచ్చేనా?

ఇక, కొమురం భీం జిల్లా పోలీసులతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా పోలీసులను సైతం ఉన్నతాధికారులు రప్పించారు. విద్యార్ధిని ఇంటికి వెళ్లేందుకు ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ఒక్క వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే, జిల్లాలో మీడియాపై సైతం పోలీసుల ఆంక్షలు విధించారు. విద్యార్ధిని శైలజ స్వగ్రామానికి వెళ్లకుండా 10 కిలో మీటర్ల దూరంలో మీడియాను ఆపేశారు పోలీసులు. చర్చలు జరుగుతున్నాయి అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై జర్నలిస్టులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.