NTV Telugu Site icon

Minister Seethakka: బీర్లకు, బార్లకు ఖర్చు చేస్తున్నారు.. రక్షణనిచ్చే హెల్మెట్ మాత్రం కొనడం లేదు..

Seethakka

Seethakka

Minister Seethakka: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రత మాసాతోత్సవాల్లో స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాహనదారలు రోడ్డు భద్రత గురించి తెలుసుకోవాలి అన్నారు. బీర్లకు, బార్లలో ఖర్చు చేస్తున్నారు.. కానీ ప్రాణానికి రక్షణనిచ్చే హెల్మెట్ కోసం మాత్రం ఖర్చు చేయడం లేదని వాపోయారు. జిల్లాలో గత ఏడాదిలో 213 మంది చనిపోయారు.. మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్లు ఉంటారు.. అందుకే రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు పాటించాలని మంత్రి సీతక్క తెలిపారు.

Read Also: Rohit Sharma: రోహిత్‌ శర్మ భవిష్యత్‌ కార్యాచరణపై నీలినీడలు..

ఇక, వాహానాలు ఎక్కి డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించరాదు.. సెల్ ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయరాదు అని సీతక్క సూచించారు. అలాగే, ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని వెల్లడించింది. శిరస్త్రం లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, మితిమీరి వేగంతో వెళ్లరాదు అని పేర్కొన్నారు. దీంతో పాటు వాహనదారులు రోడ్డు మీదకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు తగ్గిపోతాయని మంత్రి సీతక్క చెప్పారు.

Show comments