NTV Telugu Site icon

Asifabad: నీట్ పరీక్షపై గందర గోళం.. సెలెక్ట్ చేసిన పేపర్ కు బదులు మరో పేపర్..!

Neet Exam

Neet Exam

Komaram Bhim Asifabad District: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ పరీక్ష నిర్వహణ పై గందర గోళం పరిస్థితి నెలకొంది. సెలెక్ట్ చేసిన పేపర్ కు బదులుగా నిర్వాహకులు మరో పేపర్ ఇచ్చినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ పరీక్షా కేంద్రంలో 323 మంది విద్యార్థులకుగాను 299 మంది విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్ టి ఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

Read also: Gold Price Today : షాకింగ్ న్యూస్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

ఎస్బిఐ బ్యాంకు నుండి తీసుకురావలసిన పేపర్ కు బదులు కెనరా బ్యాంకు నుండి తీసుకువచ్చిన పేపర్ ను ఇవ్వడంతో విద్యార్థులు గందర గోళంలో పడ్డారు. దేశవ్యాప్తంగా Gridu అనే పేపర్ ఇవ్వాల్సి ఉండగా Nagnu అనే పేపర్ ఇచ్చినట్టు విద్యార్థులు చెపుతున్నారు. ఈ పరీక్షా కేంద్రంలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. (NTA) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పందించి, ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నిన్న సాయంత్రం 5 గంటల వరకు పరిక్ష జరిగింది. పరీక్షపై యూట్యూబ్ లో అనాల్సిస్ వీడియో చూడడంతో వీళ్లు రాసిన పేపర్ లోని ఒక్క ప్రశ్న మ్యాచ్ కాలేదు.

Read also: T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్కు ఉగ్రదాడి భయం..?

దీంతో ఆసిఫాబాద్ విద్యార్థులు ఖంగుతిన్నారు. దీంతో వేరే జిల్లా వేరే సెంటర్ లో రాసిన విద్యార్థుల పేపర్ లతో పోల్చి చూడటంతో పేపర్ మారిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇవ్వాళ జిల్లా కలెక్టర్ కు ఆసిఫాబాద్ లో నీట్ రాసిన విద్యార్థులు పిర్యాదు చేయనున్నారు. అయితే.. దీనిపై కోఆర్డినేటర్ నరేందర్ స్పందిస్తూ.. తప్పిదం జరిగిందని పై స్థాయి వాళ్లకు సమాచారం ఇచ్చామంటున్నారు. మరి ఆసిఫాబాద్ విద్యార్థులు నీట్ పరీక్ష రాసిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. మరి దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందిస్తారా? కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన 181యూనివర్శిటీల వైస్ ఛాన్స్‎లర్లు