Site icon NTV Telugu

317 జీవోను తక్షణమే రద్దు చేయాలి: కోదండరాం

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల కూర్పు, ఉపాధ్యాయుల కేటాయింపు గందరగోళంగా మారిందని ఆయన విమర్శించారు. ఉపాధ్యాయుల కేటాయింపులో శాస్త్రీయత లేదన్నారు. సీనియారిటీ లిస్టును ఎక్కడా ప్రదర్శించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తప్పుడు జీవో తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు.

Read Also:రైతులకు భరోసా కల్పించేందుకు దొర బయటికి రారు: షర్మిల

ఉద్యోగులతో చర్చించకుండా ఏకపక్షంగా జీవోలు తీసుకువచ్చి ఉద్యోగులను తన్నుకు చావండి అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ జీవోతో ఇప్పటికే కొందరు ఉద్యోగులు స్థానికత ఆధారంగా బదీలీలు చేపట్టడం లేదని మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకున్నారని కోదండరాం గుర్తు చేశారు. ప్రభుత్వం సానూకూల ధోరణితో వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలని, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

Exit mobile version