Site icon NTV Telugu

Kodanda Reddy : జీవో 111ను రివ్యూ చేయాలి.. బహిరంగంగా చర్చించాలి

Kisan Congress National Vice President M Kodanda Reddy About 111 G.O.

సీఎం కేసీఆర్‌ 111 జీవోను ఎత్తివేస్తామని అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు చివరి రోజున ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు గాంధీభవన్‌లో కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్‌ను ఆలోంచించుకొని మాస్టర్ ప్లాన్ చేయాలని.. కానీ ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదని ఆయన మండిపడ్డారు.

నిన్న కేసీఆర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 111 జీవో రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడే అంశాన్ని ముందుగా బులిటెన్ రూపంలో తెలపాలన్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్షాలను అవమాన పరిచే విధంగా చేశారన్నారు. ఒక ముఖ్యమైన జీవో రద్దు చేస్తామని ప్రకటించే ముందు ఎలాంటి చర్చ లేదా.. నేషనల్ సెన్సింగ్ అథారిటీ హైదరాబాద్‌లో ఏ భూమి ఎలా వాడుకోవాలో తెలిపారని ఆయన వెల్లడించారు. గండిపేట నీరు చాలా మంచివి అలాంటి చెరువులను పొడిచేస్తామని అనడం చాలా దారుణమన్నారు.

https://ntvtelugu.com/mahesh-kumar-goud-about-111-go/
Exit mobile version