Site icon NTV Telugu

Kodanda Reddy : ధరణి లక్షల మంది రైతుల భూమి హక్కుల సమస్య

Kodanda Reddy

Kodanda Reddy

ధరణి కీలకమైన అంశమని, ఇది లక్షల మంది రైతుల భూమి హక్కుల సమస్య అని అన్నారు ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ నాటికి ధరణి తీసుకువచ్చి ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యిందని, ధరణి అనేక సమస్యలు తెచ్చి పెట్టింది. ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలకు, రైతులకు ధరణి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని, కమిటీ, ప్రభుత్వం పై పెద్ద భాద్యత ఉంది. తొందర పాటు వల్ల ఏదైనా తప్పు జరిగితే ఇబ్బందేనని కోదండ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే అన్ని సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.

Kodikathi Fight: కోడిపందాల విషయంలో వాగ్వివాదం.. కోడికత్తితో యువకుడిపై దాడి

అంతేకాకుండా.. రైతులకు తెలిసేలా ధరణిలోని తప్పులను సోమవారం సమావేశంలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. యూపీఐ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముందు భూముల ప్రపోజల్ పెట్టిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ధరణి కమిటీ సభ్యులు సునీల్ మాట్లాడుతూ..CCLA కమిషనర్ మా కమిటీకి పూర్తి సమాచారం కమిటీకి అందజేశారని, ఈరోజు కీలక అంశాలపై చర్చించామన్నారు. అసలైన పని ఇప్పటి నుంచే ప్రారంభంకాబోతోందన్నారు సునీల్‌. సోమవారం పూర్తి స్థాయి కమిటీ సమావేశం సీసీఎల్‌ఏలో జరుగుతుందని, సమస్యలకు పరిష్కారాలు కనుక్కుంటామన్నారు.

Raja Saab: ప్రభాస్ సినిమా ప్లాట్ లీక్ చేసిన ఐఎండీబీ.. అరెరే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా మరి.

Exit mobile version