Accident : సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌లోని దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, ఆ ప్రాంతంలో నిలిచివున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఎస్‌ఐ అశోక్ , కానిస్టేబుల్ స్వామిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వారు కారు ప్రయాణిస్తున్నారు.
Coolie : ‘చికిటు’ లిరికల్ సాంగ్.. యావరేజ్ రెస్పాన్స్
తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు , పోలీసులు కలిసి కారులో నుంచి బయటకు తీసి, తక్షణమే కోదాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి ప్రధాన కారణాలు వేగం , నిద్రమత్తుగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.