NTV Telugu Site icon

Hyderabad Crime: సికింద్రాబాద్ లో దారుణం.. పక్కకు జరగమంటే ప్రాణాలే తీశారు..

Secendrabad Crime

Secendrabad Crime

Hyderabad Crime: సికింద్రాబాద్ రసల్పురాలో దారుణం చోటుచేసుకుంది. పాన్ షాప్ వద్ద నలుగురు యువకులు నిలబడ్డారు. అయితే అప్పుడే మరో వ్యక్తి పాన్ షాప్ కు రావడం కాస్త పక్కకు జరగండి అనడంతో యువకుల మధ్య జరిగిన గొడవ కాస్త బస్తీలో నడి రోడ్డుపై ఓ యువకుడి ప్రాణాలు తీసేవరకు వెళ్ళింది.

రసూల్ పూర్వ అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్న తరుణ్.. పదవ తరగతి వరకు చదివాడు.. అతను ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే స్థానికంగా ఉంటున్న యువకులతో చిన్నపాటి గొడవ జరగగా.. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారింది. నడిరోడ్డుపై అతనిపై దాడి చేయడంతో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసిన వినకుండా తీవ్రంగా కొట్టడంతో పాటు కత్తితో దాడి చేయగా.. తరుణ్ అక్కడే కుప్పకూలడు. విషయం గమనించిన స్థానికులు తరుణ్ ను ఆసుపత్రికి తరలించగా ఆప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.

Read also: Sudheer: టీవీ అయిపోయింది.. ఇక ఓటీటీ మీద పడ్డ ‘సుధీర్’..!

తరుణ్ ను విగతజీవిగా చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. వెంటనే బేగంపేట్ పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు జరుపుతుండగా.. అక్కడ జరిగిన దాడి దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదు కావడంతో.. దాడి చేసిన నలుగురు వరంగల్ కు చెందిన యువకులుగా గుర్తించారు పోలీసులు. పాన్ షాప్ వద్ద పక్కకు జరగాలని తరుణ్ కోరడంతో.. ఒకరిపై ఒకరి దాడికి వెళ్లిందని, చివరికి ప్రాణాలు తీసే వరకు పరిస్థితి మారిందని స్థానికులు తెలిపారు.

Read also: Pawan Kalyan: ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్.. డ్రైవర్‌ల సమస్యలపై ఆరా!

మరోవైపు మియాపూర్ లో అల్లుడు మామను చంపిన ఘటన నగరం ఉలిక్కిపడేలా చేసింది. అల్లుడు రవికుమార్ కూతురు అనితల మధ్య తరచు గొడవలు జరిగేవి. గొడవల కారణంగా కొద్ది రోజుల క్రితం ఇంటి నుండి అనిత వెళ్లిపోయింది. నా కూతురు లేకుండా నువ్వు నా ఇంట్లో ఎలా ఉంటావని అల్లుడితో మామ కిష్టయ్య గొడవ పడ్డాడు. గొడవ పెద్దగా అవ్వడంతో పక్కనే ఉన్న పారతో కిష్టయ్య తలపై బలంగా కొట్టిన అల్లుడు వెంకటేష్. తలపై బలంగా కొట్టడంతో కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. నిందితుడు రవికుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
CM Kejriwal : సీఎం కేజ్రీవాల్ బ్యారక్ పక్కన ఎవరెవరు గ్యాంగ్ స్టర్లు ఉన్నారంటే ?