Ragging : కెఎల్ఆర్ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..
- కెఎల్ఆర్ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
- సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులపై విద్యార్థినికి వేదన
- హెచ్ఆర్సీ తక్షణ ఆదేశాలు – కాలేజీలకు హెచ్చరిక
- ఒక నెలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragging : ఖమ్మం జిల్లా పాల్వంచలోని కెఎల్ఆర్ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కాలేజీలో ర్యాగింగ్ వేధింపులకు తాళలేక ఒక విద్యార్థిని కాలేజీని వదిలిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు శ్రుతి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ను ఆశ్రయించి తన వేదనను తెలియజేశారు.
శ్రుతి ఫిర్యాదులో కాలేజీ యాజమాన్యం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. “మూడు లక్షల రూపాయలు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెబుతోంది,” అని ఆమె పేర్కొన్నారు.
Also Read
Truck: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ప్రమాదం.. 20 కార్లను ఢీకొట్టిన ట్రక్కు..
ఈ ఘటనపై స్పందించిన హెచ్ఆర్సీ కాలేజీ యాజమాన్యాన్ని వెంటనే విద్యార్థినికి సర్టిఫికెట్లు అందించాలని ఆదేశించింది. సర్టిఫికెట్లను నిలిపివేసే అధికారం కాలేజీలకు లేదని స్పష్టం చేసింది.
హెచ్ఆర్సీ ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలు విద్యార్థుల సర్టిఫికెట్లు అనవసరంగా నిలిపివేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఒక నెల రోజుల్లో సమర్పించాలని సంబంధిత అధికారులను హెచ్ఆర్సీ ఆదేశించింది. విద్యార్థుల హక్కులను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ప్రత్యేకంగా పేర్కొంది.
Can You Eat Snake Eggs: పాము గుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తింటే ఏమౌతుంది..?
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!