Ragging : ఖమ్మం జిల్లా పాల్వంచలోని కెఎల్ఆర్ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కాలేజీలో ర్యాగింగ్ వేధింపులకు తాళలేక ఒక విద్యార్థిని కాలేజీని వదిలిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు శ్రుతి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ను ఆశ్రయించి తన వేదనను తెలియజేశారు.
శ్రుతి ఫిర్యాదులో కాలేజీ యాజమాన్యం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. “మూడు లక్షల రూపాయలు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెబుతోంది,” అని ఆమె పేర్కొన్నారు.
Truck: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ప్రమాదం.. 20 కార్లను ఢీకొట్టిన ట్రక్కు..
ఈ ఘటనపై స్పందించిన హెచ్ఆర్సీ కాలేజీ యాజమాన్యాన్ని వెంటనే విద్యార్థినికి సర్టిఫికెట్లు అందించాలని ఆదేశించింది. సర్టిఫికెట్లను నిలిపివేసే అధికారం కాలేజీలకు లేదని స్పష్టం చేసింది.
హెచ్ఆర్సీ ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలు విద్యార్థుల సర్టిఫికెట్లు అనవసరంగా నిలిపివేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఒక నెల రోజుల్లో సమర్పించాలని సంబంధిత అధికారులను హెచ్ఆర్సీ ఆదేశించింది. విద్యార్థుల హక్కులను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ప్రత్యేకంగా పేర్కొంది.
Can You Eat Snake Eggs: పాము గుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తింటే ఏమౌతుంది..?
