Site icon NTV Telugu

KL University: NIRF ర్యాంకింగ్స్‌లో కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీ సత్తా

Kl University

Kl University

కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ (KL Deemed University) విద్యారంగంలో తన సత్తా చాటుకుంటోంది. ఇటీవల ప్రకటించిన NIRF ర్యాంకింగ్స్‌లో జాతీయ స్థాయిలో 27 వ ర్యాంక్ సాధించింది KL DEEMED యూనివర్సిటీ. భారత పరిశ్రమల సమాఖ్య నుంచి జాతీయ స్థాయిలో రెండు అవార్డులు పొందింది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల నాణ్యత ప్రమాణలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే నేషనల్ INSTITUTE ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ – ఎన్ ఐ ఆర్ ఎఫ్ లో కె ఎల్ DEEMED యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 27 వ ర్యాంక్ పొందినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారధి వర్మ తెలిపారు. నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాబోధన, విద్యా ప్రణాళిక వంటి విషయాల్లోనే కాకుండా విద్యార్థుల కోసం మౌళిక వసతుల కల్పన, అత్యాధునిక పరిశోధనా కేంద్రాలు, గ్రంధాలయం అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

NIRF Rankings :ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. ఐఐటీ మద్రాస్‌దే మొదటి స్థానం

అన్ని విభాగాల్లోనూ నాణ్యతా ప్రమాణాలను పాటించడం కోసం కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ఫలితంగానే తమ విద్యా సంస్థ అనేక విభాగాల్లో ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, జాతీయ అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగాలను పొందుతున్నారని ఆయన చెప్పారు.

యూనివర్సిటీ నిర్వహణ విషయంలో ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామన్నారు. నీటి నిర్వహణ, వ్యర్ధాల నిర్వహణ విషయంలో భారత పరిశ్రమల సమాఖ్య నుంచి జాతీయ స్థాయిలో 2, 3 ర్యాంక్ లను పొందినట్లు చెప్పారు. ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థుల ఆశయాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉత్తమ విద్యాసంస్థను అందిచటమే తమ లక్ష్యమని డాక్టర్ సారధివర్మ స్పష్టం చేశారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ప్రముఖ సంస్థలు ప్రకటించిన అనేక ర్యాంకింగ్ లలో జాతీయ స్థాయిలో 2, 3 ర్యాంకులను పొందామని, యూనివర్సిటీ అమలుచేస్తున్న విద్యా ప్రమాణాలు, సాధిస్తున్న ప్రగతికి నిదర్శనమని అన్నారు.

Rana Daggubati: చైతూ కాదు.. ఆ రీమేక్‌లో రానా కన్ఫమ్

Exit mobile version