Site icon NTV Telugu

Kishan Reddy: నేడు ముషీరాబాద్ లో కిషన్‌ రెడ్డి పర్యటన..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి తెలంగాణ రాష్ట్రంపైనే ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ లో ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు ముషీరాబాద్ లో కిషన్‌ రెడ్డి పర్యటించనున్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వాడవాడ తిరుగుతూ పర్యటించి బీజేపీ పథకాల గురించి వివరించనున్నారు. ముషీరాబాద్ అసెంబ్లీలోని అరుణ కోపరేటివ్ సొసైటీ, ముషీరాబాద్ డివిజన్, మల్లేష్ టవర్స్, నియర్ శివాలయం, ముషీరాబాద్ డివిజన్, పద్మ కాలనీ, అడిక్మెట్ డివిజన్, జెమినీ కాలనీ వెల్ఫేర్ సొసైటీ, రాంనగర్ డివిజన్ లలో ఆయన పర్యటన కొనసాగనుంది.

Read also: Fire Accident: నగరంలో అగ్నిప్రమాద ఘటనలు.. భయాందోళనలో ప్రజలు..!

ఇక తాజాగా సికింద్రాబాద్ అసెంబ్లీ, తార్నాక అడ్డగుట్ట డివిజన్లో పర్యటించారు. అక్కడ కలకంటి అపార్ట్మెంట్స్, తార్నాక చింతల్ బస్తీ ప్రజలతో మాట్లాడారు. అక్కడి నుంచి ఎస్ఎస్ పార్ట్మెంట్స్, హైట్స్ సండే మార్కెట్, శ్రీకర్ శ్రీవాస అపార్ట్మెంట్ స్ట్రీట్ నెంబర్ 3 పర్యటించి బీజేపీ అందిస్తున్న పథకాల గురించి వివరించారు. శాంతినగర్ అడ్డగుట్ట, తుకారం గేట్ లో పర్యటించి ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ గెలిస్తే అందరికి న్యాయం జరుగుతుందని వివరించారు. అనంతరం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం వెంకటగిరిలో పర్యటించారు. వెంకటగిరి చేరుకున్న కేంద్రమంత్రి తొలుత స్థానిక పోచమ్మ ఆలయాన్ని సందర్శించారు.

Read also: Passenger Pushed TTE: కదిలే రైలు నుంచి ‘టీటీఈ’ ని తోసేసిన వ్యక్తి.. మరో ట్రైన్​ ఢీకొట్టి అక్కడికక్కడే మృతి..!

అనంతరం బస్తీలో స్థానికులతో ముచ్చటించారు. అట్రియా 10 మంది అపార్ట్‌మెంట్ సభ్యులతో ముచ్చటించారు. అనంతరం శ్రీనగర్ కాలనీలోని సాయికిరణ్ అపార్ట్ మెంట్ లో కేంద్రమంత్రి పర్యటించారు. అపార్ట్‌మెంట్‌లోని మహిళలు వారికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి అపార్ట్‌మెంట్ పెద్దలు, సంక్షేమ సంఘం సభ్యులతో కాసేపు ముచ్చటించారు. తాను అంబర్ పేట్ బిడ్డనని, సికింద్రాబాద్ ఎంపీ కాకముందు అంబర్ పేట్ ప్రజలు నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈసారి కూడా సికింద్రాబాద్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
DC vs KKR: గెలుపులతో ఫుల్ జోష్ లో ఇరు జట్లు.. మరి ఈసారి విజయం ఎవరికీ వరించేనో..?!

Exit mobile version