Site icon NTV Telugu

Kishan Reddy: సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటన.. రైల్యేస్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షణ

Kishan Redy

Kishan Redy

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ సికింద్రాబాద్ లో పర్యటించనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు రైల్యే స్టేషన్ అభివృద్ది పనులను పర్యవేక్షించునున్నారు. కాగా..కేంద్ర ప్రభుత్వం రూ.715 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్‌ను గతేడాది ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు దక్షిణ మధ్య రైల్వే జీఎం, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు దశల్లో స్టేషన్‌ నిర్మాణ పనులు చేపట్టగా, మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ అనిల్ కుమార్ జైన్ ఇతర సీనియర్ అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షిస్తారు. దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయ స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.715 కోట్లు కేటాయించారు. రైల్వేస్టేషన్ ఆధునీకరణతో పాటు స్టేషన్‌కు నలువైపులా రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.

Read also: Astrology: ఫిబ్రవరి 07, బుధవారం దినఫలాలు

కాంగ్రెస్ పార్టీ పాలన తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆరు హామీలు ప్రజల చేతుల్లో గారడీగా మారాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫించన్లు, ఇళ్లు, రేషన్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇంతవరకు వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వనరులను ఎలా కేటాయిస్తారనే దానిపై స్పష్టత లేదని ఆరోపించారు. రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. పొదుపు సంఘాల మహిళా సమావేశంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Chile : చిలీలో చల్లారని కార్చిచ్చు.. 131మంది మృతి, 370మంది గల్లంతు, 3000ఇళ్లు దగ్ధం

Exit mobile version