Site icon NTV Telugu

kishan Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే.. కాంగ్రెస్ అరాచకాలను ఎండగడతాం

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మె్ల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. కాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం నిన్నటితో ముగిసింది. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరుగనన్నది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజీపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read:FASTag: ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్.. పాటించకపోతే డబుల్ టోల్ తప్పదు!

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో స్థానిక LN ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన మీడియాకి వివరించారు. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కాంగ్రెస్ అరాచకాలను మండలిలో ప్రస్తావించి ఎండగడతాం అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పాటు పడతారని అన్నారు. మీడియా సమావేశంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, MLC అభ్యర్థులు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్కా కొమురయ్య, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాజేశ్వర్ రావు దేశ్ పాండే, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version