Site icon NTV Telugu

Kishan Reddy: పార్టీ ఫిరాయింపులు మీద తప్ప గ్యారంటీల మీద దృష్టి లేదు.. సీఎంపై కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: ఈ సీఎం కు పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది తప్ప ఇచ్చిన గ్యారంటీ ల అమలు మీద లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సంస్థాపన దినోత్సవం సందర్బంగా.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పాము.. చేసామన్నారు. అయోధ్య లో భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేయాలని అద్వానీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తీర్మానం చేశామన్నారు. ట్రిబుల్ తలాక్ రద్దు చేసామన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కోసం మోడీ సర్కార్ పని చేస్తుందన్నారు. దేశం విశ్వ గురువు కావాలన్నారు. ప్రధాని విశ్వ నేతగా మార్గనిర్దేశనం చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటి నినాదం ఈసారి 400 సీట్లు… మరో సారి ప్రధాని మోడీ కావాలన్నారు.

Read also: Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి ధరలు..

బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు. కాంగ్రెస్ ఇక పెరిగే అవకాశం లేదన్నారన్నారు. ఓ రాహుల్ గాంధీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీ లను వంద రోజుల్లో అమలు చేస్తానని అన్నావు కదా? ప్రశ్నించారు. ఈ సీఎం కు పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది తప్ప ఇచ్చిన గ్యారంటీ ల అమలు మీద లేదన్నారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉండేది బీజేపీనే అన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన రాహుల్ గాంధీ, కేసీఆర్ .. బీజేపీ నీ ఏమీ చేయలేరన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం బీజేపీ తోనే సాధ్యమన్నారు. బీజేపీకి డబల్ డిజిట్ స్థానాలు వస్తాయన్నారు. బీజేపీ నీ ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను కోరుతున్నా అన్నారు. మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నేడు రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ లో పాల్గొననున్నారు. ఆ తరవాత ఇంటర్నల్ మీటింగ్స్, రాత్రి హైదరాబాద్ లోనే బన్సల్ బస చేయనున్నారు.
BJP Founder Day: కార్యకర్తలకు మోడీ, అమిత్ షా, నడ్డా శుభాకాంక్షలు

Exit mobile version