NTV Telugu Site icon

Kishan Reddy : కేంద్ర నిధులు ఇచ్చింది నిజం కాదా..?

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే 2 దఫాలుగా పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్‌ ఇటీవల యాదాద్రి నుంచి మూడో దశ పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. నేడు వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మూడో దశ పాదయాత్ర ముగించనున్నారు. అయితే.. మూడో దశ ప్రజసంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్న జేపీ నడ్డా.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. అయితే.. అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర నిధులు ఇచ్చింది నిజం కాదా.. వరంగల్ లో స్మార్ట్ సిటీ కోసం కేంద్రం 196 కోట్ల నిధులు ఇచ్చిందన్నారు.

 

టీఆర్ఎస్ అవినీతి పాలన నుంచి విముక్తి కల్పిస్తామని, రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులు ఖర్చుచేసిందన్నారు. కాళేశ్వరానికి కేంద్రం వేల కోట్లు ఇచ్చిందని, రామప్ప టెంపుల్ కు కేంద్రం యునెస్కో గుర్తింపు తీసుకువచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. వేయి స్థంబాల గుడి అభివృద్ధికి కూడా కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తూ ఉందన్నారు. కరోనాను అరికట్టడంతో కేంద్రం ఎంతో కృషి చేసిందని కిషన్‌ రెడ్డి తెలిపారు.