Site icon NTV Telugu

Kishan Reddy : నకిలీ వాగ్దానాలు, చేతకాని పాలన, మోసపూరిత హామీలు

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy : తెలంగాణలో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయన ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నకిలీ వాగ్దానాలు, చేతకాని పాలన, మోసపూరిత హామీలతోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “భారీగా బస్సు ఛార్జీల పెంపుతో తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ సర్కారు తీవ్ర భారాన్ని మోపుతోంది. ఇది సామాన్య ప్రజల జీవనంపై నేరుగా దెబ్బతీసే నిర్ణయం. ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తేమీ కావు,” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Huawei WATCH D2: బీపీ, ఈసీజీ పర్యవేక్షణతో హువావే వాచ్ డి2 విడుదల.. ధర ఎంతంటే?

“సామాన్యులు, విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పేద ప్రజలపై ఆర్థిక భారం మోపే ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను,” అని తెలిపారు. బస్సు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి, రాజకీయ లాభాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

Mahindra Thar 3-Door: మహీంద్రా థార్ 3-డోర్ లాంచ్.. స్టన్నింగ్ లుక్, గ్రేట్ ఫీచర్స్!

Exit mobile version