NTV Telugu Site icon

Kishan Reddy: విమోచనం కోసం మొదటిసారి గొంతు ఎత్తిన పార్టీ బీజేపీ

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: విమోచనం కోసం మొదటిసారి గొంతు ఎత్తిన పార్టీ బీజేపీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ తరపున, మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ తరపున ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం ఎగురవేయడం జరుగుతుందన్నారు. విమోచనం కోసం మొదటిసారి గొంతు ఎత్తిన పార్టీ బీజేపీ. నిజాంకు వ్యతిరేకంగా లక్షలాదిమంది పోరాడిన పోరాటాన్ని చరిత్రను కాంగ్రెస్ పార్టీ సమాధి చేసే ప్రయత్నం చేసిందన్నారు. అనేక మంది యోధులు భూమికోసం భుక్తి కోసం స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం నిజాంకు ఎదురు నిలబడి పోరాటం చేశారని తెలిపారు. అలాంటి వారి త్యాగాలను గుర్తించకుండా సెప్టెంబర్ 17న విమోచన ఉత్సవాలు జరపకుండా కాంగ్రెస్ పార్టీ ఘోరతప్పిదం చేసిందన్నారు. తర్వాత వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తుందని తెలిపారు.

ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే అని మండిపడ్డారు. ఈ రెండు పార్టీల గురువు ఎంఐఎం పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరి దాన్ని తోలుబొమ్మల ఆట ఆడిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ చరిత్రను 1998 నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందన్నారు. బీజేపీ కార్యకర్తలు అనేక పోరాటాలు చేసి పోలీసుల తూటాలకు ఎదురు నిలబడి విమోచన ఉత్సవాలు జరపాలని డిమాండ్ చేశారు. అలాంటి పోరాటాలను గుర్తించే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ విమోచన ఉత్సవాలను అధికారికంగా జరుపుతున్నదని తెలిపారు. నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య ద్వారా నిజాం నోడించి హైదరాబాద్ గడ్డపై మూడు రంగుల జెండా ఎగరవేశారని అన్నారు. 75 ఏళ్ల తర్వాత నేటి హోం మంత్రి అమిత్ షా గారు త్రివర్ణ పతాకం ఎగరవేయబోతున్నారని తెలిపారు. తెలంగాణ చరిత్రను సమాధి చేసిన అణగదొక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ పార్టీ ఏ ముఖం పెట్టుకొని హైదరాబాదులో వర్కింగ్ కమిటీ సమావేశాలు పెట్టుకున్నదో ప్రజలు అడగాలని తెలిపారు.

సెప్టెంబర్ 17 నాడు కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ గడ్డమీద మీటింగ్ పెట్టుకునే నైతిక అర్హత లేదు. తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపని దోషి కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తల తోక లేకుండా సెప్టెంబర్ 17న సమైక్యత దినోత్సవాలు అంటుందని తెలిపారు. సమైక్యత దినోత్సవం ఎలా వచ్చిందో కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు అడగాలని అన్నారు. మూర్ఖత్వంతో ఓటు బ్యాంకు రాజకీయాలతో మజ్లీస్ తో కుమ్మక్కై టీఆర్ఎస్ పార్టీ ఈరోజు సమైక్యత దినోత్సవం అంటున్నారు. ఇది సమైక్యత దినోత్సవం ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు. ఈ రెండు పార్టీలు 75 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని తెలిపారు. వచ్చే సంవత్సరం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ గ్రామాన తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుతామన్నారు. మజిలీస్ పార్టీతో మాకు అవసరం లేదు మజిలీస్ అంటే మాకు భయం లేదన్నారు. కానీ మీకు ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగుతారు కాబట్టి ఆ పార్టీ మీకు గురువు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే మీరు దానికి భయపడుతున్నారని అన్నారు. విమోచన ఉత్సవాలు జరిపే ధైర్యం ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు.
NTR: టైగర్ 3 క్లైమాక్స్ లో ఎన్టీఆర్… ఊహించిన దానికన్నా ముందే ఎంట్రీ