యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడు అనే విషయం ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ప్రస్తుతం హ్రితిక్ రోషన్ చేస్తున్న ఫైటర్ సినిమా కంప్లీట్ అవ్వగానే… ఎన్టీఆర్ చేస్తున్న దేవర షూటింగ్ కంప్లీట్ అవ్వగానే వార్ 2 స్టార్ట్ అవుతుందని మేకర్స్ నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది. దేవర నవంబర్ నెలలో షూటింగ్ పూర్తవ్వనుంది, ఆ తర్వాత వార్ 2లో ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ఇప్పటికే వార్ 2 ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. దేవర-ఫైటర్ సినిమాల షూటింగ్స్ అయిపోగానే ఇమ్మిడియట్ గా సెట్స్ పైకి వెళ్లడానికి గ్రౌండ్ వర్క్ ని చేస్తున్నారు. అయితే వార్ 2 సినిమా కన్నా ముందే ఎన్టీఆర్ యష్ రాజ్ స్పై యూనివర్స్ లోకి ఎంటర్ కానున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
నవంబర్ 10న సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా రిలీజ్ కానుంది. బిగ్గెస్ట్ స్పై యాక్షన్ సినిమాగా టైగర్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న ఈ 3వ సినిమాకి బాలీవుడ్ లో భారీ బజ్ ఉంది. హ్యుజ్ సెటప్ లో సల్మాన్ ఖాన్ vs ఇమ్రాన్ హష్మీగా టైగర్ 3 రూపొందింది. ఈ మూవీ సల్మాన్ ఖాన్ కి మొదటి పాన్ ఇండియా హిట్ గా నిలుస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ప్రిడిక్ట్ చేస్తున్నాయి. టైగర్ 3 మూవీ ఎండింగ్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి… వార్ 2 కాన్ఫ్లిక్ట్ ని స్టార్ట్ చేయాలని యష్ రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే టైగర్ 3 షూటింగ్ కంప్లీట్ అయిపొయింది కాబట్టి ఎన్టీఆర్ టైగర్ 3 సినిమాలో ఉన్నాడు అనే వార్తలో నిజం ఉండకపోవచ్చు. ఒకవేళ ఎన్టీఆర్ క్యామియో ప్లే చేసి ఉంటే మాత్రం… ఇప్పటికే టైగర్ 3 సల్మాన్ ఖాన్ కి షారుఖ్ ఖాన్ కూడా కలిసాడు, ఇక ఎన్టీఆర్ కూడా కలిస్తే బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చినట్లే.