Site icon NTV Telugu

Kishan Reddy: తెలంగాణలో బీజేపీకి డబల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తాయి

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: తెలంగాణలో బీజేపీకి డబల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 28న బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఆశించిన పలితాలు రాకపోయినా ఓట్ల శాతం పెరిగిందన్నారు. సీట్లు పెరిగాయన్నారు. ఎల్లుండి సమావేశానికి అమిత్ షా వస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలు ఈమీటింగ్ కు హాజరు అవుతారన్నారు. 90 రోజుల ఆక్షన్ ప్లాన్ ఉందని అన్నారు. తెలంగాణలోని అన్నివర్గాల్లో బీజేపీకి, మోడీకి సానుకూల చర్చ జరుగుతుందన్నారు. ఎన్నికల కోసం మోడీకి ఓటు వేయడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అద్భుత మెజారిటీతో ఎవరు ఊహించని విధంగా మోడీ హ్యాట్రిక్ సాధించబోతున్నారని అన్నారు.

Read also: America : అమెరికాలోకి అక్రమంగా ప్రవేశంచిన 20లక్షల మంది అరెస్ట్

తెలంగాణలో బీజేపీకి డబల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 2019తో పోలిస్తే తేడా ఉంది తెలంగాణలోని ప్రతి ఇంట్లో మోడీ చర్చ జరుగుతుందని అన్నారు. శాసన సభ ఎన్నికలకు సంబంధించిన సమీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామన్నారు. జనవరి నెలలో పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెడతామన్నారు. యువత బీజేపీ వైపు ఉందన్నారు. జనవరి 22 అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భాగస్వామ్యం కావాలని నిర్ణయించిందని కిషన్ రెడ్డి అన్నారు.
Sriya Reddy: ఎంత చెప్పినా ప్రశాంత్ నీల్ వినలేదు.. సలార్ రాధారమ పాత్రపై శ్రీయరెడ్డి షాకింగ్ కామెంట్స్

Exit mobile version