Site icon NTV Telugu

Kishan Reddy: అల్లాహ్ అక్బర్ అని కేటీఆర్ అనగలడా.. అనే దమ్ముందా.?

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: అల్లాహ్ అక్బర్ అని కేటీఆర్ అనగలడా.. అనే దమ్ముందా.? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సిటీ పార్టీ ఆఫీస్ లో అఖిల భారతీయ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎలక్షన్ రోజు వరకు క్యాంపెయిన్ నిర్వహించాలి.. నాకోసం కాదు ఓటింగ్ పెంచేలా.. అన్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్ వేసేలాగా ఒక మూవ్మెంట్ తీసుకువద్దామన్నారు. చదువుకున్న వారే ఓటింగ్ కు ముందుకు రావడం లేదన్నారు. మనమంతా ఐక్యమత్యంగా ఉండాలి.. హైదరాబాద్ ను కాపాడుకోవాలన్నారు. మూడు సార్లు వరుసగా గెలిచి.. నాలుగో సారి వెయ్యి ఓట్లతో ఓడిపోయానన్నారు. ఓటింగ్ కు రాకపోవడం వల్లే ఓడాను.. అవతలి వ్యక్తికి నలభై వేల ఎంఐఎం ఓట్లు పడ్డాయన్నారు. ఎంఐఎం ఇద్దరితోను ఉంటుంది.. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లతో కలుస్తుందన్నారు. శక్తికి వ్యతిరేకంగా పోరాడాలి అని రాహుల్ గాంధీ అంటారన్నారు. సనాతన ధర్మం లేకపోతే దేశం మరో పాకిస్తాన్ అవుతుందన్నారు. సనాతన ధర్మం లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదన్నారు. అల్లాహ్ అక్బర్ అని కేటీఆర్ అనగలడా.. అనే దమ్ముందా.? అని ప్రశ్నించారు.

Read also: Purandeswari: సీఎం జగన్‌పై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది..

అల్లాహ్ అక్బర్ ను విమర్శిస్తే కేటీఆర్ హైదరాబాద్ లో ఉంటాడా.? అని కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడికి జై అంటే రాముడు అన్నం పెడుతాడా.? జీతాలు ఇస్తాడా.? అని కేటీఆర్ అన్నాడని, మీ అయ్యా కూడా హోమాలు యాగాలు చేస్తాడు కదా.! ఎందుకో అడుగు కేటీఆర్.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో సనాతన ధర్మం.. హిందూయిజం ఉన్నన్ని రోజులే దేశం సెక్యులర్ గా ఉంటుందన్నారు. జూన్ రెండో వారంలో మోడీ హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. 2047 వరకు అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉంచాలనేదే మోడీ లక్ష్యమన్నారు. భారత్ వందేళ్ళు పూర్తి చేసుకునే నాటికి వికసిత్ భారత్ గా చేయాలనేదే మా లక్ష్యం అన్నారు. పీవీని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే.. మేము భారతరత్నతో గౌరవించామన్నారు. అవార్డు ప్రధాన కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఆహ్వానం ఇస్తే రాలేదన్నారు. ఖర్గే ఒక్కడే వచ్చాడు.. మేము చప్పట్లు కొడితే ఆయన ముడుచుకుని కూర్చున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు.
Jithender Reddy: అ ఆ ఇ ఈ ఉ ఊ అంటున్న జితేందర్ రెడ్డి

Exit mobile version